Skip to main content

AP Intermediate Exams: ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య ఇది..

ఏపీలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
AP Intermediate exams starts on friday

అనంతపురం: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సర విద్యార్థులకు పరీక్ష జరిగింది. అనంతపురం నగరంలోని వివిధ కేంద్రాలను కలెక్టర్‌ గౌతమి పరిశీలించారు. కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 22,920 మంది విద్యార్థులకు గాను 22,311 మంది హాజరయ్యారు. 609 మంది గైర్హాజరయ్యారు.

AP Education Scheme: విద్యార్థులకు విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల..

ఒకేషనల్‌ విద్యార్థులు 2,135 మందికి గాను 2,034 మంది హాజరయ్యారు. 101 మంది గైర్హాజరయ్యారు.

Exams 2024

ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ వెంకటరమణనాయక్‌ మూడు పరీక్షా కేంద్రాలను, డీఈసీ సభ్యులు నాలుగు పరీక్షా కేంద్రాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 8 కేంద్రాలను పరిశీలించారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌ 2 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.

JNTUA NAAC Grade: న్యాక్‌ ఏ గ్రేడ్‌ సాధించిన అనంతపురం జేఎన్‌టీయూ

Published date : 02 Mar 2024 12:45PM

Photo Stories