Skip to main content

JNTUA NAAC Grade: న్యాక్‌ ఏ గ్రేడ్‌ సాధించిన అనంతపురం జేఎన్‌టీయూ

అనంతపురంలోని జేఎన్‌టీయూ సాధించిన ఏ గ్రేడ్‌ సందర్భంగా యూనివర్సిటీలోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులు, కళాశాల యాజమాన్యం సమావేశమయ్యి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంతటి విజయం రావడానికి చేసిన దోహదాన్ని వెల్లడించారు యాజమాన్యం..
Ananthapur JNTU achieves grade A through NAAC

అనంతపురం: సాంకేతిక విద్యలో రాయలసీమలోనే కల్పతరువుగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ అనంతపురం సిగలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌)–ఏ గ్రేడ్‌ సాధించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం కళాశాలను 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి యూనివర్సిటీగా మార్పు చేశారు.

AP Education Scheme: విద్యార్థులకు విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల..

అప్పటి నుంచి జేఎన్‌టీయూ(ఏ) అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ సాంకేతిక యూనివర్సిటీగా నిలిచింది. న్యాక్‌కు దరఖాస్తు చేసిన తొలి ప్రయత్నంలోనే ఏ గ్రేడ్‌ దక్కించుకుంది. 2029 ఫిబ్రవరి 28 వరకు న్యాక్‌ –ఏ గ్రేడ్‌ గుర్తింపు వర్తిస్తుంది.

Teachers: ఉపాధ్యాయులకు సూచన..

చాలా ఆనందంగా ఉంది

జేఎన్‌టీయూ అనంతపురం న్యాక్‌ –ఏ గ్రేడ్‌ సాధించడం చాలా ఆనందంగా ఉందని వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం వీసీ కాన్ఫరెన్స్‌ హాలులో మీడియాతో మాట్లాడారు. న్యాక్‌ గ్రేడింగ్‌తోనే వర్సిటీకి పరిశోధన ప్రాజెక్ట్‌లు రావడానికి వీలు కలుగుతుందన్నారు. అతి తక్కువ పాయింట్లలోనే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ రాలేదని భావిస్తున్నామన్నారు. లోటుపాట్లను అధిగమించి న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ రావడానికి కృషి చేస్తామన్నారు. సెల్ఫ్‌ స్టడీ రిపోర్ట్‌ను రూపకల్పన చేసిన రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, ఐక్యూఏసీ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి, ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ న్యాక్‌ గ్రేడింగ్‌ రావడానికి విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. యూనివర్సిటీ పురోగతికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ హేమచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఈశ్వరరెడ్డి, పి.సుజాత, శోభాబిందు, పాలకమండలి సభ్యుడు ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

TS Inter Public Exams Alert 2024 : ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఈ నిబంధన సడలింపు.. ఈ ఏడాది కొత్తగా..

ఏ గ్రేడ్‌కు దోహదం చేసిందివే..

న్యాక్‌– ఏ గ్రేడ్‌ రావడానికి గల కారణాలను న్యాక్‌ పీర్‌ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ కావడం, సింహభాగం పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం ప్రధానమైన అంశంగా గుర్తించారు. భవిష్యత్తులో మరిన్ని విభాగాలు అభివృద్ధి చెందడానికి జేఎన్‌టీయూ (ఏ)కు కావాల్సినంత స్థలం అందుబాటులో ఉంది.

● గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు దీటుగా విద్యా ప్రణాళిక రూపకల్పన చేశారు. కోర్సు పూర్తయితే తక్షణ ఉపాధి కల్పించే రీతిలో ప్రోగ్రామ్స్‌ ప్రవేశపెట్టారు. అకడమిక్‌ పురోగతి సాధించే దిశగా విద్యా ప్రణాళికలో అంశాలు చేర్చారు.

IB Syllabus in AP Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భేష్‌.. ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్‌..

● రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రూ.100 కోట్లు వెచ్చించి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు.

● 2008లో ఏర్పడినప్పటికీ అతి తక్కువ కాలంలోనే 134 అనుబంధ కళాశాలలు, 5 కానిస్టిట్యూట్‌ కళాశాలలతో (క్యాంపస్‌ కళాశాల, ఓటీపీఆర్‌ఐ, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, పులివెందుల, కలికిరి కళాశాలలు) నాణ్యమైన విద్యను పెంపొందిస్తోంది. ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ సిస్టమ్స్‌ (మూక్స్‌), స్వయం ప్రోగ్రామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నారు.

Tribal DSC: ప్రత్యేక ట్రైబల్‌ డీఎస్సీ ప్రకటించాలని వినతి

దరఖాస్తు చేసిన తొలిసారే గణనీయమైన గ్రేడింగ్‌, 2029 వరకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ వర్తించేలా ఉత్తర్వుల జారీ

Published date : 02 Mar 2024 12:09PM

Photo Stories