AP Inter 1st Year Results 2023 Link : నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల.. వెంటనే చూడాలంటే.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలను చూడొచ్చు
ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ శేషగిరి బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను ఏపీ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫలితాలను వెంటనే చూడాలంటే https://results.sakshieducation.com ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
ఈ సారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రారంభమైన.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెల్సిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 పరీక్షకు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9,20,552 మంది, ఒకేషనల్ విద్యార్థులు 83,749 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియను అత్యంత త్వరగా ముగించింది. అలాగే ఈ ఫలితాల విడుదలతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలో కంటే ఏపీలో ముందుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
➤☛ TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
➤☛ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి