AP EAPCET Results 2023 : నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఈ సారి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే..?
మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసన తరువాత ఈఏపీసెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. మే 24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
Check College Predictor - 2023 TS EAMCET | AP EAPCET
చదవండి: నిఘా నీడలో... ప్రశాంతంగా ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష
అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3,37,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. చూసుకోవచ్చు.
TSPSC Group 1 Prelims Question Paper & Key 2023: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం & కీ సాక్షి ఎడ్యుకేషన్‌లో చూడొచ్చు
ఈ మార్కులకు ఈ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది...
Score Expected Rank
90 – 99 1 – 100
80 – 89 101 – 1,000
70 – 79 1,001 – 5,000
60 – 69 5,001 – 15,000
50 – 59 15,001 – 50,000
40 – 49 50,001 – 1,50,000
30 – 39 1,50,000
TSPSC Group 1 Prelims: బూట్లు, ఫోన్లతో వస్తే గేటు బయటే... ఓన్లీ చెప్పులతో వస్తేనే అనుమతి
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి...
☛ ఫలితాల కోసం https://results.sakshieducation.com, sakshieducation.com వెబ్‌సైట్ లోకి వెళ్లండి.
☛ హోమ్ పేజీలో ఏపీ ఎంసెట్ 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
☛ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
☛ మీ ఏపీ ఎంసెట్ 2023 మార్కులు, ర్యాంకు డిస్‌ప్లే అవుతుంది.
☛ తదుపరి రిఫరెన్స్ కోసం కాపీని డౌన్ లోడ్ చేసి సేవ్ చేయండి.