Skip to main content

AP Mega DSC Notification 2024 : శుభ‌వార్త‌.. రేపే మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డీఎస్సీ అభ్యర్థుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న‌ది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం.
DSC Notification Release by Andhra Pradesh Government   DSC Notification Expected Tomorrow  Good News for DSC Candidates in Andhra Pradesh  ap mega dsc 2024 notification   Andhra Pradesh Education Minister Botsa Satyanarayana

రేపు ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల భర్తీ, విధి విధానా­లను ప్రకటించ‌నున్నారు. రేపు మొత్తం ఎన్ని ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారో.. ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇప్ప‌టికే..

ap education minister botsa satyanarayana dsc notification 2024

అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్‌మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్‌ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్‌ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్‌ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి  మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు రేపు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఎంతో ఊరట రానున్న‌ది.

Published date : 26 Jan 2024 11:23AM

Photo Stories