Skip to main content

DSC 2024 Update News : డీఎస్సీ-2024 మారిన కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే.. ఈ సారి ఈ ప‌రీక్ష‌ల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
ap dsc  2024 news exam dates  Announcement of DSC-2024 Examination Schedule Change by Andhra Pradesh Government

రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. టెట్‌ పరీక్షలు నిర్వహించింది.

--తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

ఉపాధ్యాయ నియామకం కోసం..
మార్చి 15వ తేదీ నుంచి  డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్‌ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించామని సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్‌ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

డీఎస్సీ-2024 నూతన షెడ్యూల్‌ వివరాలు..
► మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు.
► ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
► ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్‌ డైరెక్టర్, ప్రిన్సిపల్‌ పరీక్షలను నిర్వహిస్తారు.
► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్స్‌ ఇస్తారు.
► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్‌–టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
► బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను  ఈ DSC https://apdsc. apcfss.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

Published date : 11 Mar 2024 10:08AM

Photo Stories