Skip to main content

AP DSC 2024 Hall tickets : మార్చి 25 వ తేదీ నుంచి డీఎస్సీ-2024 హాల్ టిక్కెట్లు.. ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
 DSC-2024 Examination Schedule Changes   Announcement by Minister Botsa Satyanarayana  ap education minister botsa satyanarayana   6100 Teacher Appointments in Andhra Pradesh

డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మార్చి 12వ తేదీన (మంగళవారం) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా..
మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డీఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డీఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు.

చదవండి: డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

హాల్ టిక్కెట్లను..
సెంటర్లను ఎంపిక చేసుకోడానికి  మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షలకు మధ్య సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఎస్జిటీ పోస్టులకు అర్హతను సమీక్షించాలని హైకోర్టు ఆదేశించ‌డంతో పరీక్షల షెడ్యూల్‌ను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published date : 13 Mar 2024 10:24AM

Photo Stories