Skip to main content

AP Tenth Class Result Date 2023 : ఏపీ ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షల ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..? విద్యార్థులకు మేలు జరిగేలా.. కీల‌క నిర్ణ‌యం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్ల‌క్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల విడుద‌ల తేదీపై విద్యాశాఖ ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2023 ఏప్రిల్‌ 18వ తేదీతో ముగియనున్న విష‌యం తెలిసిందే.
AP Tenth Class Result Date 2023 Telugu News
AP Tenth Class Result Date 2023 Details

పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొననున్నారు.

☛ Telangana 10th Class Results 2023 Date : తెలంగాణ 'ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు' విడుద‌ల ఎప్పుడంటే..?

మే రెండో వారంలోనే.. ఫ‌లితాలు విడుద‌ల‌..

ap ssc results 2023 telugu news

రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి అన్నారు. వాల్యుయేషన్ పూర్తైన తర్వాత ఇతర ప్రొసీడింగ్స్‌ కూడా త్వరిగతిన పూర్తి చేసి.. ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను ఆలస్యం చేయకుండా మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి తెలిపారు. ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను https://results.sakshieducation.com/లో చూడొచ్చు.

☛ AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్‌

విద్యార్థులకు మేలు జరిగేలా.. కీల‌క నిర్ణ‌యం ఇదే..

ap ssc public exam latest news telugu 2023

మరోవైపు పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో ఎవరైనా విద్యార్థి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

Published date : 15 Apr 2023 12:25PM

Photo Stories