Skip to main content

Foundational School: ద్విభాషా పుస్తకాలపై కేంద్ర మంత్రి కితాబు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు అందించడం గొప్ప పరిణామమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కితాబిచ్చారు.
Union Ministers Book on Bilingual Books
బైలింగ్యువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌ను పరిశీలిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

జి–20లో భాగంగా పూణెలో జరుగుతున్న ‘జన్‌ భాగిదారీ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ఏర్పాటు చేసిన ‘ఫౌండేషనల్‌’ స్కూల్‌’ స్టాల్‌ను జూన్‌ 21న కేంద్రమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మాతృ భాషాధారిత బహుభాషా (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు.

చదవండి: Respect Books: పుస్తక మర్యాద

ఇలాంటి పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్‌ రామచంద్ర, పశ్చిమ బెంగాల్‌ ఎస్సీఈఆర్టీ ప్రతినిధులు, మహారాష్ట్ర డైట్‌ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునాది విద్యకు అవలంబిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. 

చదవండి: Karnataka Syllabus Controversy: హెగ్డేవార్, సావర్కర్‌ చాప్టర్ల తొలగింపు

Published date : 22 Jun 2023 05:38PM

Photo Stories