Karnataka Syllabus Controversy: హెగ్డేవార్, సావర్కర్ చాప్టర్ల తొలగింపు
Sakshi Education
ఆరు నుంచి పదో తరగతి వరకు కన్నడ, సాంఘిక శాస్త్రాల పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల్లో మార్పులకు కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర మంత్రి మండలి జూన్ 15న ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాల మేరకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెగ్డేవార్, హిందూత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ తదితరులకు సంబంధించిన పాఠ్యాంశాలను స్కూలు సిలబస్ నుంచి తొలగిస్తారు. సంఘ సంస్కర్త, విద్యావేత్త సావిత్రీభాయ్ ఫూలే సంబంధ పాఠ్యాంశాలు, ఇందిరా గాంధీకి నెహ్రూ రాసిన లేఖలు, అంబేడ్కర్ కవితలు తదితరాలను గతంలో బీజేపీ సర్కార్ తొలగించింది. వాటినే మళ్లీ కలిపారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణలను పూర్తిగా రద్దుచేయాలని కేబినెట్ భేటీలో మంత్రులు నిర్ణయించారు. ‘ విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సర సిలబస్‌లోనూ మార్పులు ఉంటాయి’ అని కేబినెట్ వివరాలను మంత్రి వెల్లడించారు.
UNESCO: యునెస్కోలోకి మళ్లీ అమెరికా.. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే..!
Published date : 16 Jun 2023 05:32PM