School Students: బడిపిల్లల ఆరోగ్య భద్రత బాధ్యత వారిదే..
ఒకటి నుంచి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడుల నిర్వహణ విషయం తెలిసిందే. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల డీఈవోలు పాఠశాలల నిర్వహణపై వేర్వేరుగా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి పాఠశాలలు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకూ నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనానంతరం వారిని ఇళ్లకు పంపాలి. కాగా, పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో యథావిధిగా సమయ పాలన పాటించాలి. ప్రీ ఫైనల్ పరీక్షలు ఇదివరకే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.15 నుంచి 12.30 వరకు నిర్వహించాలి. ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు ఆ రోజు జరగబోయే పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ స్టడీ అవర్ నిర్వహించాలి. వడదెబ్బ నివారణ కోసం ఓఆర్‌ఎస్ పాకెట్లను వైద్యారోగ్య శాఖ సహకారంతో సమకూర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించకూడదు. ఏప్రిల్ రెండో శనివారం కూడా పాఠశాలలు పనిచేస్తాయి. అన్ని యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
చదవండి:
ఏపిల్ 4 నుంచి ఒంటిపూట బడులు.. 27 నుంచి పది పరీక్షలు ఇలా..
ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు