Skip to main content

Department of Education: ఇతర రాష్ట్రాలకు మన ‘పాఠాలు’

రాష్ట్ర విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.
adimulapu suresh
ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

పలు రాష్ట్రాలు మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలను పరిశీలిస్తున్నాయని తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి మార్చడంతో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నారన్నారు. మార్చి 10న శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచడానికి తీసుకుం టున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గడిచిన 33 నెలల్లో రూ.90,000 కోట్లు విద్యా రంగంపై ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. జగనన్న అమ్మఒడి కింద రూ,13,023 కోట్లు ఇవ్వగా, నాడు–నేడులో ఇప్ప టి వరకు రూ.3,669 కోట్లతో స్కూళ్లను ఆధునీకరించినట్లు చెప్పారు. పిల్లలకు పౌష్ఠికాహారం కో సం జగనన్న గోరుముద్ద కింద రూ.1,600 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద రూ.1,437.31 కోట్లు వ్యయం చేశామన్నారు. రూ.444.89 కోట్లతో స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించామని, పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవాడికి ఇంగ్లిష్‌ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ కొందరు సభ్యులు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. 

చదవండి: 

Good News: టీచర్ల పని.. చదువు చెప్పడమే

New Education System: నూతన విద్యావిధానంపై కీల‌క స‌మావేశం.. ప్రతిరోజూ ఒక కోత్త ప‌దం

TISS: సాంకేతిక బోధనపై టీచర్లకు శిక్షణ

రాష్ట్రంలో స్కిల్ కాలేజీలు, స్కిల్ వర్సిటీలు​​​​​​​

Published date : 11 Mar 2022 12:12PM

Photo Stories