రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను స్థానికంగానే సమకూర్చాలని, తద్వారా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో స్కిల్ కాలేజీలు, స్కిల్ వర్సిటీలు
ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. తిరుపతి, విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలను నెలకొల్పనున్నారు. ఇందుకోసం కోర్సుల ఎంపిక కూడా పూర్తి కాగా ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.