Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుంచంటే..?
Sakshi Education
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.
విజయవాడలో ఆయన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో ఆగస్టు 9వ తేదీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 12వ తేదీ సమీక్షిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని తెలుస్తుంది.
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 7 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని చెప్పారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Road Transport Corporation: ఆర్టీసీ కీలక నిర్ణయం.. అంత్యక్రియల వ్యయం పెంపు.. ఎంతంటే..
Published date : 10 Aug 2024 12:57PM
Tags
- APSRTC
- Free Bus Travel for Women
- free bus
- Free Bus Journey
- Transport Minister Ramprasad Reddy
- CM Chandrababu Naidu
- RTC bus
- Sakshi Education Updates
- Andhra Pradesh
- andhrapradesh state
- TransportMinister
- MandipalliRamPrasadReddy
- FreeBusTravel
- WomenTravel
- RTCbuses
- ChiefMinisterChandrababuNaidu
- ImplementationReview
- TravelScheme
- August12
- sakshieducationlatest news