Tenth Spot Valuation: ఈ కేంద్రంలో పరీక్షల మూల్యాంకనం.. 1200 మంది ఉపాధ్యాయుల నియామకం..!
గుంటూరు: టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌కు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకు జరగనున్న స్పాట్ వాల్యూయేషన్ విధులకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,200 మంది ఉపాధ్యాయులను నియమించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన రెండు లక్షల జవాబు పత్రాలను ఎనిమిది రోజుల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మూల్యాంకనం చేయాల్సి ఉంది.
SSC Exam Evaluation:ఎస్‌ఎస్‌సీ పరీక్షలు పూర్తి.. స్పాట్ వ్యాల్యూవేషన్‌కి తేదీ..!
సబ్జెక్టుల వారీగా అవసరమైన ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమిస్తూ, వారికి ఆర్డర్ కాపీలను పంపిన విద్యాశాఖాధికారులు వారిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెండు లక్షల స్క్రిప్ట్‌లకుగాను, ప్రతి ఉపాధ్యాయుడు రోజుకు 40 చొప్పున పేపర్లను మూల్యాంనం చేయాల్సి ఉంది. మూల్యాంకన విధుల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే ఉంటారు. టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమితులైన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 9.00 గంటలకు గుంటూరు శివారు పెదకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ సెంటర్ పక్కన ఉన్న సెయింట్ జోసఫ్ సీబీఎస్‌ఈ హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని డీఈవో పి.శైలజ ఆదేశించారు.
AP Schemes: అమ్మ ఒడి వచ్చాకే పిల్లల చదువులు..
విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తూ వచ్చిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో టాయిలెట్ల కొరత ఉండేది. దీంతో ప్రధానంగా మహిళా ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ప్రస్తుత ఏడాది స్పాట్ వాల్యూయేషన్ కోసం అన్ని వసతులు కలిగిన పాఠశాలను ఎంపిక చేయడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తీరినట్లే. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సూచన మేరకు గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఉన్న సెయింట్ జోసఫ్ సీబీఎస్‌ఈ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Central Schools: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
Tags
- spot valuation
- Tenth Class Exams
- board exam papers
- Evaluation centers
- St Joseph's High School
- teachers selection for evaluation
- duties at evaluation centers
- ap tenth class board exams
- ap board papers evaluation
- District Education Officer
- P Shailaja
- Subject wise teachers
- tenth exams spot valuation
- Education News
- Sakshi Education News
- guntur news