AP Schemes: అమ్మ ఒడి వచ్చాకే పిల్లల చదువులు..
అన్నమయ్య: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంతో మా పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా పోయింది. అంతే కాకుండా అనేక సంక్షేమ పథకాలతో మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యాయి.
Tenth Evaluation: పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభం.. ఎప్పుడు..?
పేదరికంతో బాధపడుతున్న మాకు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వర్తించక చాలా ఇబ్బందులు పడ్డాం. మా కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అమ్మ ఒడి పథకం వర్తించింది. అలాగే నా పేరుతో ఇంటి స్థలంతో పాటు పక్కాగృహం మంజూరైంది. ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంతకంటే మేలు చేసే ప్రభుత్వం మరొకటి లేదు.
– కటిక కృష్ణవేణి, చాకలి వీధి, వేంపల్లె
April 1st Holiday 2024 : గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1వ తేదీన హలీడే.. కారణం ఇదే..!
సొంతింటికల నెరవేర్చిన సీఎం
నాకు వివాహమై దాదాపు 15 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం నాకు ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ మంజూరు చేయలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగనన్న కాలనీలో ఇంటి స్థలం ఇచ్చి, అందులోనే హౌసింగ్ తరపున ఇంటిని కూడా మంజూరు చేయించారు. నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సొంత ఇంటి కలను నెరవేర్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను.
– గంగనపల్లి సావిత్రి, ఒంటిమిట్ట
ఇంటి వద్దకే ధ్రువపత్రాలు
గతంలో మా పిల్లల కోసం ధ్రువపత్రాలు పొందాలంటే మీ సేవ లో దరఖాస్తు చేసుకుని అనంతరం పత్రాలు చే తికందాలంటే మీసేవ, తహసీల్దార్ కార్యాల యాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. అయితే జగనన్న సురక్ష కార్యక్రమంలో మాకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం గ్రామ వలంటీర్‌కు తెలిపాము. ఒక్కరోజులోనే ఇంటి వద్దకు సర్టిఫికె ట్లు తెచ్చి ఇచ్చారు. ప్రభుత్వ పాలన ఇంత సులభతరం చేసిన సీఎంకి రుణపడి ఉంటాం.
– ఎం. వెంకటమల్లమ్మ, వేపులబైలు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా లభించని సర్టిఫికెట్లు నేడు జగనన్న సురక్ష ద్వారా సత్వరమే అందుతున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న సర్కారు బడుల రూపు రేఖలు నాడు–నేడుతో ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సొంతంగా సెంటు స్థలం కొనే స్థోమత లేక.. అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్న పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వెరసి పేదల బతుకులు బాగుపడ్డాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
Summer Holidays 2024 for Students : రేపటి నుంచే.. వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే...