Central Schools: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
మధురానగర్: విజయవాడ కేంద్రీయ విద్యాలయ నంబర్ 1లో 2024–25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, బాలవాటిక–3లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఆదిశేషశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31, 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి తరగతి కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో https://kvsonlineadmission.kvs.gov.in బాలవాటిక–3 కోసం, విద్యాలయ ప్రాంగణంలో దరఖాస్తు తీసుకోవచ్చని తెలిపారు.
AP Schemes: అమ్మ ఒడి వచ్చాకే పిల్లల చదువులు..
పూర్తిచేసిన బాలవాటిక–3 దరఖాస్తులను కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. మొదటి తరగతి, బాలవాటిక–3 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ ఒకటో తేదీ 10 గంటలకు ప్రారంభమై 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని వివరించారు. మరింత సమాచారానికి కేంద్రీయ విద్యాలయ వెబ్‌సైట్ https://nolvijayawada.kvs.ac.inలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
Tenth Evaluation: పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభం.. ఎప్పుడు..?