CDMA: ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ విడదల.. కౌన్సెలింగ్‌కి చివరి తేదీ..
Sakshi Education
పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది.
స్కూల్ అసిస్టెంట్(లాంగ్వేజ్ పండిట్) మినహా అన్ని కేటగిరీల్లో పదోన్నతులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఎంఎం నాయక్.. రీజనల్ డైరెక్టర్లను, కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ మధ్య సీనియారిటీ జాబితా ప్రకటన, 7 నుంచి 9వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 10 నుంచి 13 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం ఉంటుంది. 14న ఖాళీల జాబితా రూపకల్పన, ఆ తర్వాత 15 నుంచి 17వ తేదీల్లో కౌన్సెలింగ్ చేపడతారు. పదోన్నతుల ద్వారా సుమారు 250 పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది.
చదవండి:
958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వాటి వివరాలు
Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం
Published date : 04 Dec 2021 01:13PM