Skip to main content

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

ఎన్నో ఏళ్లుగా మోక్షం కలగని మోడల్‌ స్కూళ్ల టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
TEACHERS
మోడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నవంబర్‌ 30న జీవో 264 విడుదల చేసింది. ఈ స్కూళ్లలోని టీజీటీ, పీజీటీలను జోన్ యూనిట్‌గా, ప్రిన్సిపాళ్లను స్టేట్‌ యూనిట్‌గా బదిలీ చేయనున్నారు. 2021 నవంబర్‌ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి బదిలీ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేసేలా షెడ్యూల్‌ను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. టీజీటీ, పీజీటీలకు ఆర్జేడీలు, ప్రిన్సిపాళ్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ బదిలీ ఉత్తర్వులు జారీచేయనున్నారు. 2021 నవంబర్‌ 1 నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారిని ప్రత్యేక విన్నపాల మేర తప్ప బదిలీ చేయరు. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ బదిలీకి ఆన్ లైన్ దరఖాస్తులను ‘https://cse.ap.gov.in’ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు బదిలీలనుంచి మినహాయింపునిచ్చారు. అయితే ఎవరైనా బదిలీని కోరుకుంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా టీచర్లు, ప్రిన్సిపాళ్ల సీనియార్టీతో పాటు వివిధ కేటగిరీల్లో వృత్తిపరంగా చూపిన ప్రతిభా ఫలితాలను అనుసరించి కేటాయించే ఎన్ టైటిల్‌మెంటు పాయింట్ల ఆధారంగా ఈ బదిలీల్లో టీచర్లకు కోరుకున్న స్థానాలను కేటాయించనున్నారు. ఆయా టీజీటీలు, పీజీటీలకు, ప్రిన్సిపాళ్లకు ఏయే కేటగిరీల్లో ఎన్ని ఎన్ టైటిల్‌మెంటు పాయింట్లు ఉంటాయో ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ స్పష్టంగా పొందుపరిచారు.

చదవండి: 

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Nadu Nedu: ప్రభుత్వ స్కూళ్లకు నిధుల వరద

గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య

Published date : 01 Dec 2021 12:52PM

Photo Stories