Skip to main content

958 Jobs: కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌.. వాటి వివరాలు

కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.
teacher jobs
కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీ

అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి డిసెంబర్ 3న అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్‌ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి డిసెంబర్ 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు. రిజర్వుడ్‌ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్‌ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్‌ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్‌ జాబితా వెలువరిస్తారు.

విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా

ప్రిన్సిపాల్‌ (స్పెషలాఫీసర్‌): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైసూ్కళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755 సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్‌ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైసూ్కళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755
పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటరీ్మడియెట్‌ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755
పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైసూ్కళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000
పీజీటీ వొకేషనల్‌: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిపొ్లమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైసూ్కళ్లలో పీజీటీ వొకేషనల్‌ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000.

షెడ్యూల్‌ ఇలా...

జిల్లా స్థాయిలో ప్రకటన విడుదల :

డిసెంబర్‌ 2

దరఖాస్తుల స్వీకరణ :

4 నుంచి 8 వరకు

దరఖాస్తుల పరిశీలన :

9, 10

ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల :

11

అభ్యంతరాల స్వీకరణ :

11 నుంచి 14 వరకు

తుది మెరిట్‌ జాబితా విడుదల :

16

కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు :

18

కేజీబీవీల్లో భర్తీ చేసే పోస్టులు.. సబ్జెక్టులు, కేటగిరీల వారీగా

ప్రిన్సిపాళ్లు 70

సీఆర్టీ పోస్టులు
తెలుగు: 26
హిందీ: 20
ఇంగ్లిష్‌: 54
మ్యాథ్స్‌: 41
ఫిజికల్‌ సైన్సు: 50
నేచురల్‌ సైన్సు: 53
సోషల్‌ స్టడీస్‌: 40
ఉర్దూ: 1

పీజీటీ పోస్టులు
తెలుగు: 70
ఇంగ్లిష్‌: 88
మ్యాథ్స్‌: 29
ఫిజికల్‌ సైన్సు: 69
కెమిస్ట్రీ: 80
బోటనీ: 49
జువాలజీ: 45
సివిక్స్‌: 16
ఎకనమిక్స్‌: 11
హిస్టరీ: 3
కామర్స్‌: 7

పీజీటీ వొకేషనల్‌
కంప్యూటర్‌ సైన్సు: 14
రిటైల్‌ మేనేజ్‌మెంటు: 1
అకౌంట్సు, ట్యాక్సేషన్: 7
ప్రీసూ్కల్‌ టీచర్‌ ట్రైయినింగ్‌: 6
ఫిజియో థెరఫీ: 2
జనరల్‌ ఫౌండేషన్: 29
ఎంఎల్‌టీ: 18
ఎంపీహెచ్‌డబ్ల్యూ: 25
పీఈటీ పోస్టులు: 34

జిల్లాల వారీగా పోస్టులు ఇలా

జిల్లా

ప్రిని్సపాల్‌

పీఈటీ

సీఆర్‌టీ

పీజీటీ

పీజీటీ ఒకేషనల్‌

ఎంపీహెచ్‌డబ్ల్యూ

ఎంఎల్‌టీ

ఫౌండేషన్ కోర్సు

మొత్తం

శ్రీకాకుళం

11

1

35

29

2

2

4

3

87

విజయనగరం

2

0

16

93

6

11

3

10

141

విశాఖపట్నం

15

7

32

105

0

5

2

2

168

తూర్పు గోదావరి

2

0

26

13

0

0

0

0

41

పశ్చిమ గోదావరి

1

0

1

2

0

0

0

0

4

కష్ణ

0

0

3

0

0

0

0

0

3

గుంటూరు

4

5

12

6

2

0

0

0

29

ప్రకాశం

6

5

24

7

2

0

1

2

47

నెల్లూరు

2

3

13

2

3

0

0

1

24

చిత్తూరు

2

2

15

28

2

2

5

3

59

కడప

8

5

16

105

2

2

0

0

138

అనంతపురం

9

5

44

64

6

3

2

2

135

కర్నూలు

8

1

48

13

5

0

1

6

82

మొత్తం

70

34

285

467

30

25

18

29

958

చదవండి:

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

Good News: టీచర్ల పదోన్నతులకు లైన్ క్లియర్

Teachers: పదవీవిరమణ వయసు పెంపు

బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్‌ ఎందుకు?

Published date : 03 Dec 2021 05:15PM

Photo Stories