Tenth Class: ముగిసిన ‘పది’ మూల్యాంకనం.. ఫలితాల వివరాలు
Sakshi Education
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం మే 22తో ముగిసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర డైరెక్టర్ దేవానందరెడ్డి తెలి పారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మే 22న జరిగిన మూల్యాంకన ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2022లో 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేసేలా 20 వేల మంది ఉపాధ్యాయుల ను విధులకు కేటాయించామన్నారు. 13 జిల్లాల నుంచి మూల్యాంకన నివేదికలు విజయవాడ చేరుతున్నాయని, పది రోజుల్లో వీటికి సమగ్ర రూపు తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. జూలై మొదటి వారం లేక రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు దేవానందరెడ్డి వివరించారు.
చదవండి:
Published date : 23 May 2022 04:05PM