SSC 2023: టెన్త్ టాపర్లకు కలెక్టర్ విందు
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షల్లో 570 ఆపైన మార్కులు సాధించిన 63 మంది విద్యార్థులను మే 12న నగరంలోని వీఎంఆర్‌డీ చిల్డ్రన్స్ ఎరీనాలో సన్మానించారు. తల్లిదండ్రులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను వేదికపైకి పిలిచి, వారి సమక్షంలో విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో విద్యా వ్యవస్థలో మార్పు మొదలైందన్నారు.
చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
విద్యాభివృద్ధికై ఇంత చక్కటి సంక్షేమ పథకాలు తన పదకొండేళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లు ఎలా ఉంటాయో తనకు తెలుసని, తన విద్యాభ్యాసమంతా ప్రభుత్వ స్కూళ్లలోనే సాగిందన్నారు. అలాంటి ప్రభుత్వ స్కూళ్లు నుంచి 600కు 592 మార్కులు తెచ్చుకోవడం అంటే మాటలు కాదన్నారు. నాడు–నేడు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, ఇదే ఫలితాలకు గొప్ప నాంది అని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలసి కలెక్టర్, ఇతర అధికారులంతా విందు భోజనం చేశారు. సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ డీవీ రమణ మూర్తి, డీఈవో ఎల్.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా