Badi Bata Programme: 26 జిల్లాల్లో తిరిగి బడి బాట పట్టించిన పిల్లల సంఖ్య ఇలా..
అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడి బాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరీ బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిలో 1,43,573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది.
చదవండి: School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు
సచివాలయాలు కేంద్రంగా
డ్రాపవుట్స్‌ను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా స్కూళ్ల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్‌ను రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పాఠశాల వయస్సుగల పిల్లలందరూ స్కూళ్లలో చేరారో లేదో పరిశీలిస్తోంది. ఈ సర్వే, పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం మేరకు బడి మానేసిన పిల్లల ఇళ్లకు సంక్షేమ, విద్యా అసిస్టెంట్, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వలంటీర్ వెళ్తున్నారు. పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. ఎక్కువ కాలం బడికి రాకపోతే అందుకు కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారా, బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు,
ఆర్ధిక సమస్యలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను చూపి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మరీ పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేరి్పస్తున్నారు. ఆ వివరాలను, తల్లిదండ్రులతో సిబ్బంది మాట్లాడుతున్న ఫొటోలను ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ రిథమ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
చదవండి: Department of Education: పాఠశాల విద్యార్థులకు ‘పరీక్ష’
26 జిల్లాల్లో తిరిగి బడి బాట పట్టించిన పిల్లల సంఖ్య
జిల్లా |
తిరిగి బడిబాట పట్టిన పిల్లలు |
కర్నూలు |
12,177 |
పల్నాడు |
10,143 |
నెల్లూరు |
9,132 |
ప్రకాశం |
8,758 |
ఎనీ్టఆర్ |
8,086 |
అనంతపురం |
7,479 |
వైఎస్సార్ |
7,206 |
నంద్యాల |
7,079 |
తిరుపతి |
6,434 |
గుంటూరు |
5,550 |
ఏలూరు |
5,549 |
కాకినాడ |
5,500 |
బాపట్ల |
5,225 |
కృష్ణా |
4,780 |
శ్రీ సత్యసాయి |
4,734 |
తూర్పుగోదావరి |
4,639 |
విశాఖపట్నం |
4,482 |
అన్నమయ్య |
4,216 |
కోనసీమ |
3,819 |
శ్రీకాకుళం |
3,627 |
పశి్చమ గోదావరి |
3,527 |
అల్లూరి సీతారామరాజు |
2,692 |
అనకాపల్లి |
2,254 |
చిత్తూరు |
2,206 |
విజయనగరం |
2,146 |
పార్వతీపురం మన్యం |
2,133 |