School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు
Sakshi Education
ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, టీచర్ల సంఘాల నేతలు పాఠశాల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
అలాచేస్తే చట్టపరమైన చర్య లు తప్పవని స్పష్టం చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో టీచర్ల సంఘాల నేతలు ప్రచా రం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ కారణంగా విద్యాభ్యాసన కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతుందని వివరించింది. డీఈవోలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
చదవండి:
Voter Turnout: రాష్ట్రంలో తొలిసారి ఓటర్ టర్నౌట్ యాప్ వినియోగం
Fundamental Right: ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు: సుప్రీంకోర్టు
Published date : 21 Oct 2022 04:51PM