Fundamental Right: ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు: సుప్రీంకోర్టు
Sakshi Education
ఎన్నికల్లో పోటీచేయడం ప్రాథమిక హక్కు, చట్టపరమైన హక్కు పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ మేరకు వాదించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.
‘‘ఎన్నికల్లో పోటీ చేయడమనేది శాసనం ద్వారా అమలయ్యే హక్కు మాత్రమే. ఎన్నిక స్వభావాన్ని బట్టి అభ్యర్థిని బలపరిచే, ప్రతిపాదించే వారికి సంబంధించిన విధి నిషేధాలు, నియమ నిబంధనలు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నాయి’’ అని గుర్తు చేసింది. ప్రపోజర్ లేని కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తనను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇది తన ప్రాథమిక హక్కును హరించడమేనన్న వాదనను తోసిపుచింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Sep 2022 06:55PM