SSC Exam Fee: టెన్త్ ఫెయిలైన విద్యార్థులు 15లోగా ఫీజు చెల్లించాలి
Sakshi Education
రాప్తాడురూరల్: మార్చి–2024లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ఫెయిలైన విద్యార్థులు సెప్టెంబరు 15లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వి.నాగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.50 అపరాధ రుసుంతో సెప్టెంబరు 16 నుంచి 20 వరకు, రూ.200 అపరాధ రుసుంతో సెప్టెంబరు 21 నుంచి 25 వరకు, రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబరు 26 నుంచి 30 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మూడు, ఆపైన సబ్జెక్టులకు రూ.125, మూడులోపు సబ్జెక్టులకు రూ.110, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం రూ.80 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా స్కూల్ లాగిన్‌లో మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు.
Published date : 31 Aug 2023 03:10PM