AP: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్
Sakshi Education
ఈ ఏడాది పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయొచ్చని ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. నిర్ణీత రుసుమును విద్యార్థులు తమ పాఠశాలల్లోనే అందజేయాలి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత రూ.50 ఫైన్‌తో సెప్టెంబర్ 20, రూ.500 ఫైన్‌తో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు మించి సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
చదవండి: మరో 15 రోజుల వరకే ఫ్రీ... ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!
Published date : 30 Aug 2023 05:54PM