Aadhaar Update: మరో 15 రోజుల వరకే ఫ్రీ... ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!
అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. అయితే ఈ గడువు ఇప్పుడు సమీపిస్తోంది.
ఇవీ చదవండి: ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, కాకినాడలో 825 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సెప్టెంబరు 14తో ముగియనుంది. ఆధార్‌లో పేరు, పుట్టినతేది, చిరునామా వంటి మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఈ గడువు ముగిశాక ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: చదువుల్లో రారాజులు... చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తల విద్యార్హతలు ఇవే..!
అప్‌డేట్ సులువుగా ఇలా..
- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి.
- లాగిన్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ కోసం క్లిక్ చేయాలి.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీ కార్డు వివరాలు చూడవచ్చు.
- మీ కార్డు వివరాలు తప్పుగా ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చు, ఆ తరువాత Next పై క్లిక్ చేయాలి
- ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- అప్‌డేట్ ఆయిన పీఓఏ, పీఓఐ డాక్యుమెంట్లు యూఐడీఏఐ వెబ్‌సైట్లో ఉంటాయి. అక్కడ వీటిని పరిశీలించుకోవచ్చు.
ఇవీ చదవండి: మరో మూడు రోజుల్లో సూర్యుడి చెంతకు ఆదిత్య... బడ్జెట్ ఎంతంటే..!