Skip to main content

Aditya L1 Mission: మ‌రో మూడు రోజుల్లో సూర్యుడి చెంత‌కు ఆదిత్య... బ‌డ్జెట్ ఎంతంటే..!

చంద్రయాన్‌–3 మిషన్‌ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్‌ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Aditya-L1,ISRO,Aditya-L1 launch on Sep 2
మ‌రో మూడు రోజుల్లో సూర్యుడి చెంత‌కు ఆదిత్య... బ‌డ్జెట్ ఎంతంటే..!

బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్‌ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్‌ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్‌ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్‌1 అధ్యయనం జరుపుతుంది.

ఇవీ చ‌ద‌వండి: ఆ న‌లుగురు... చంద్రయాన్-3 స‌క్సెస్ వెన‌క ఉన్న‌ది వీరే

Aditya-L1

భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్‌ పాయింట్‌–1 (ఎల్‌1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్‌ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్‌ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా.

ఇవీ చ‌ద‌వండి: చంద్రయాన్-3 సూప‌ర్ స‌క్సెస్‌.. వాట్ నెక్ట్స్.. దీని వ‌ల్ల మానవాళికి ఏం లాభం?

Aditya-L1

ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్‌1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం బరువు 1500 కిలోలు కాగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.368 కోట్లు. సూర్యుడిని శోధించడానికి విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రావయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ సహా ఏడు పరిశోధన పరికరాలను ఆదిత్య-ఎల్‌1 మోసుకెళ్లనుంది.

ఇవీ చ‌ద‌వండి: విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... ఏడాదికి 75 వేల స్కాల‌ర్‌షిప్.. అప్లై చేసుకోండి!

Published date : 29 Aug 2023 05:25PM

Photo Stories