Skip to main content

HDFC Bank Parivartan: విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... ఏడాదికి 75వేల స్కాల‌ర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి!

ఆర్థికంగా వెన‌క‌బ‌డిన విద్యార్థుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేయూత‌నిస్తోంది. బ‌డుగు, బ‌ల‌హీన విద్యార్థులు చ‌దువుల్లో రాణించేందుకు ఆర్థికంగా అండ‌గా నిలుస్తోంది. ఇందుకోసం ప‌రివ‌ర్త‌న్ ప్రోగ్రాం కింద ఉప‌కార‌వేత‌నాలు అంద‌జేస్తోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... ఏడాదికి 75వేల స్కాల‌ర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి!
విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... ఏడాదికి 75వేల స్కాల‌ర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2023-24 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వ‌ర‌కు చ‌దువుకునే విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

HDFC ECS స్కాలర్‌షిప్ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందనుంది. ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ (ECS)లో భాగంగా HDFC బ్యాంక్ దీన్ని ప్రవేశపెట్టింది.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్‌  స్కూల్  ప్రోగ్రాం

అర్హత: 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.

స్కాలర్‌షిప్:   1-6వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.

ఇవీ చ‌ద‌వండి: National Awards 2023 List : 'పుష్ప' ఎక్క‌డైన‌ తగ్గేదేలె.. అలాగే 'RRR' కూడా..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్  స్కాలర్‌షిప్‌ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం

అర్హత: 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్ చదువుతున్న వారు అర్హులు.

స్కాలర్‌షిప్‌: డిప్లొమా వారికి రూ.20,000, అండర్ గ్రాడ్యుయేషన్ రూ.30,000, ప్రొఫెషనల్ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ పీజీ ప్రోగ్రాం.

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు. 

స్కాలర్‌షిప్‌:  పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు.

ఇవీ చ‌ద‌వండి: ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన ఇన్ఫోసిస్‌, విప్రో... భారీగా వేరియ‌బుల్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రితేది: 30.09.2023

ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు కావలసిన పత్రాలు:
🔹 పాస్‌పోర్ట్ సైజు ఫోటో
🔹 మునుపటి సంవత్సరం మార్క్‌షీట్స్‌ (2022-23) 
🔹 ఆధార్ కార్డ్ 

ఇవీ చ‌ద‌వండి: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు
🔹 ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ప‌త్రాలు (ఫీజు రసీదు/అడ్మిషన్ లెటర్/సంస్థ ID కార్డ్/బోనఫైడ్ సర్టిఫికేట్ (గవర్నమెంట్ స్కూల్ వాళ్లకు) 
🔹 బ్యాంక్ పాస్‌బుక్ (18 సంవత్సరాల లోపు ఉన్నవారు తండ్రి అకౌంట్ అయిన పర్లేదు)
🔹 Income Certificate 
🔹 వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలలోపు ఉండాలి.
🔹 గత మూడేళ్ల‌లో కుటుంబ క‌ల‌హాలు/గొడ‌వ‌లు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న విద్యార్థుల‌కు ప్రాధాన్యత ఉంటుంది.

Published date : 24 Aug 2023 06:56PM

Photo Stories