National Awards 2023 List : 'పుష్ప' ఎక్కడైన తగ్గేదేలె.. అలాగే 'RRR' కూడా..
తాజాగా ప్రతిష్టాత్మక National Awards 2023 ల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా మూడు జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపికైయ్యారు. అలాగే ఉత్తమ చిత్రంగా 'పుష్ప' ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడు.
2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో’ (భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్(ఆర్‌ఆర్‌ఆర), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (శ్రీనివాస మోహన్)లకు జాతీయ అవార్డులు దక్కాయి.
2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు పంచుకున్నారు. అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి)లకు దక్కాయి.
సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది.
☛ Filmfare Awards 2022 : 'పుష్ప' తగ్గేదేలె.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో క్లీన్ స్వీప్..
ఇప్పటికే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి స్టంట్ కొరియోగ‍్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మేల్ సింగర్, కొరియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్ తదితర కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. అలానే ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
జాతీయ చలనచిత్ర అవార్డులు-2023 List :
- ఉత్తమ నటుడు అవార్డు- అల్లు అర్జున్
- ఉత్తమ నటి అవార్డు- ఆలియ భట్
- ఉత్తమ ఫీచర్ ఫిల్మ్-రాకెట్రీ
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం- RRR
- ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ- RRR
- ఉత్తమ నేపద్య సంగీత దర్శకుడు- కీరవాణి
- ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీ శ్రీ ప్రసాద్
- ఉత్తమ కొరియోగ్రాఫర్- ప్రేమ్‌రక్షిత్
- ఉత్తమ తెలుగు చిత్రం- ఉప్పెన
- ఉత్తమ కన్నడ చిత్రం- చార్లీ 777
- ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్- 'ఏక్ థా గావ్'
- ఉత్తమ సినీ విమర్శకుడు - పురుషోత్తమా చార్యులు (తెలుగు)
- ఉత్తమ నటుడు అవార్డు రేసులో ఎన్టీఆర్, రాంచరణ్,అల్లు అర్జున్ సూర్య, మధవన్ ఉన్నారు.
- ఉత్తమ నటి అవార్డు రేసులో ఆలియ భట్, కంగనా రనౌత్ ఉన్నారు
Tags
- National Film Awards 2023
- National Film Awards 2023
- pushpa movie
- pushpa movie awards 2022
- pushpa movie awards 2023
- national film awards pushpa 2023
- Pushpa Awards 2023
- pushpa national film awards 2023
- rrr national film awards 2023
- pushpa and rrr national film awards 2023
- 69th national film awards 2023 winners list
- 69th national film awards 2023 winners list in telugu
- 69th national film awards winners
- 69th national film awards winners news telugu
- national film awards 2023 best actor allu arjun
- allu arjun nandi awards
- allu arjun nandi awards 2023
- allu arjun nandi awards 2022