AP 10th Supplementary Dates 2023 : ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు 2023 తేదీలు ఇవే.. ఫెయిల్ అయిన విద్యార్థులకు..
ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షలు-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే (Click Here)
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహించామని మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందన్నారు. ఈ ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సారి టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
ఫెయిల్ అయిన విద్యార్థులకు..
ప్రభుత్వ చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 18 రోజుల్లో ఫలితాలు ప్రకటించమని, పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వరకూ పకడ్బందీగా వ్యవహరించామన్నరు. తక్కువ ఉత్తీర్ణీత వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గతేడాది పేపర్ లీక్‌కు పాల్పడిన 70 మందికి పైగా టీచర్లను అరెస్ట్ చేశామన్నారు. ఈ ఏడాది ఆరోపణలు రాకుండా టెన్త్ పరీక్షలు నిర్వహించమన్న బొత్స.. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహం చెందవద్దన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని బొత్స సూచించారు.
☛ AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
ఫస్ట్.. లాస్ట్ జిల్లాలు ఇవే..
☛ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత).
☛ నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం).
☛ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
పదో తరగతి రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరపాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలను గుర్తించాం. వాటిలో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని బొత్స వివరించారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
☛ జూన్ 2 నుంచి 10 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.
☛ మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం.
☛ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు : మే 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలి.
☛ రూ.50 ఆలస్య రుసుంతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 933 పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు (సున్నా శాతం). ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ☛ చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!