IAS Varun Baranwal Success Story: 15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ స‌క్సెస్ స్టోరీ

15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయాడు. అప్ప‌టివ‌ర‌కు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే ఆ కుర్రాడి జీవితం ఈ ఘ‌ట‌న‌తో త‌ల‌కిందులైంది. కుటుంబ పెద్ద‌ మ‌ర‌ణంతో ఆ కుటుంబం ఆర్థికంగా గాడితప్పింది. దీంతో కుటుంబ బ‌రువును 15 ఏళ్లకే మోయాల్సి వ‌చ్చింది.
IAS Varun Baranwal

అలా సైకిల్ మెకానిక్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓ కుర్రాడు.. కేవ‌లం 8 ఏళ్ల‌కే యావ‌త్తు దేశాన్ని త‌నవైపుకు తిప్పుకున్నాడు. 23 ఏళ్ల వ‌య‌సులో సివిల్స్‌లో ర్యాంకు సాధించి స‌త్తాచాటాడు. అత‌నే వరుణ్ భరన్వాల్.... 

UPSC Civils Ranker Ashrita Success Story : ఓట‌మి.. ఓటమి.. చివ‌రికి విజ‌యం ఇలా.. కానీ ల‌క్ష్యం మాత్రం ఇదే

చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన వ‌రుణ్‌... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేవాడు. వ‌రుణ్ ప్ర‌తిభ గురించి తెలిసిన చుట్టుప‌క్క‌ల వారు అత‌డు చ‌దువుకునేందుకు ఆర్థికంగా అండ‌గా నిలిచేవారు. దీంతో ప‌నులు చేసుకుంటూనే చ‌దువును కొన‌సాగించాడు. 

మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుక‌నేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. అలా వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్‌తో పాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. 

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

కానీ వరుణ్ 2006లో పదో తరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ, తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైంది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే స‌రిపోయేది. దీంతో అప్పుల భారం పెరిగిపోయింది. 

ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ల‌కు పదోతరగతి పరీక్షల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అందులో అత‌ను వారుండే పట్టణంలో సెకండ్ టాప‌ర్‌గా నిలిచాడు. 

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారం వైపు వ‌చ్చాడు.

అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. కాలేజీ ఫీజు పదివేల రూపాయలు చెల్లించ‌డంతో వ‌రుణ్ మ‌ళ్లీ కాలేజీలో అడుగుపెట్టాడు. అయితే నెల‌వారీ ఖ‌ర్చుల కోసం ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ప‌రీక్ష ఫీజు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు ఉప‌యోగించుకునేవాడు. 

IAS Anju Sharma Success Story: ప‌ది, ఇంట‌ర్‌లో ఫెయిల‌య్యా... ఈ అప‌జ‌యాలే న‌న్ను 22 ఏళ్ల‌కే ఐఏఎస్‌ను చేశాయ్‌... అంజు శ‌ర్మ స‌క్సెస్ స్టోరీ

మంచి మార్కుల‌తో ఇంటర్ పూర్తి చేసిన వ‌రుణ్‌.. ఎంబీబీఎస్ చ‌దవాల‌నుకున్నాడు. కానీ, రెక్కాడితే డొక్క‌నిండ‌ని ప‌రిస్థితుల్లో త‌న ల‌క్ష్యాన్ని వ‌దిలేసుకోవాల్సి వ‌చ్చింది. అలా ఎంఐటీ కాలేజ్ ఆఫ్‌ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాల్సి వ‌చ్చింది. క‌ష్టాలు క‌ల్లారా చూసిన వ‌రుణ్ బీటెక్‌లో ఎప్పుడూ అంద‌రికంటే ముందుడే వాడు. 

2008లో కాలేజీలో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి చ‌దువుల‌పైనే ధ్యాస‌పెట్టాడు. బీటెక్‌ను 86 శాతం మార్కుల‌తో పూర్తి చేశాడు.  అదే ఏడాది అంటే 2012లో నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో మల్టీ నేషనల్ కంపెనీ అయిన డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం సెటిల్ అయ్యింద‌నుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది.

అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకున్నాడు. మిత్రుల సహాయంతో యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వ‌డం ప్రారంభించాడు. 

Civils Toppers: రెండేళ్ల‌పాటు మంచంలోనే... ప‌ట్టుద‌ల‌తో చ‌దివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే క‌న్నీళ్లే

ఉద్యోగం వ‌దిలేయ‌డంతో త‌న ప్రిప‌రేష‌న్‌కు అవ‌స‌ర‌మైన‌ పుస్తకాలు కొనేందుకు కూడా త‌నద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండేవి కాదు. దీంతో ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదవడం ప్రారంభించాడు. అలా 2016లో వెలువ‌డిన‌ యూపీఎస్‌సీ సివిల్స్ ఫ‌లితాల్లో ఆల్ ఇండియా 32వ ర్యాంకు సాధించాడు. ముస్సోరిలో శిక్ష‌ణ పూర్తి చేసిన త‌ర్వాత గుజరాత్ రాష్ట్రంలోని  హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా త‌న కెరియ‌ర్‌ను ప్రారంభించాడు. ప్ర‌స్తుతం వరుణ్ Banaskantha District క‌లెక్ట‌ర్‌గా ఉన్నారు.

క‌ష్టాల‌ను ఎదురీది 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వ‌రుణ్ భరన్వాల్ ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.  ఇలాంటి మ‌రెన్నో స‌క్సెస్ స్టోరీస్, స్ఫూర్తిదాయ‌క‌మైన క‌థ‌నాల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ను ఫాలో అవ్వండి.

#Tags