ADCET-2024: ఏడీసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన నాలుగేళ్ల కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు చేసుకోండి. కోర్సుల వివరాలు ఇవే..

ఏపీ ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ).. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ.. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు:
»    పెయింటింగ్‌/స్కల్పచర్‌/యానిమేషన్‌/అప్లైడ్‌ ఆర్ట్స్‌/ఫోటోగ్రఫీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ). 
»    ఇంటీరియర్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌). 
»    అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ఎంఈసీ/బైపీసీ/ఎంబైపీసీ/సీఈసీ/హెచ్‌ఈసీ లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 
(సీబీటీ) ఉంటుంది. బీఎఫ్‌ఏ, బీడిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్‌(సీబీటీ) 
విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 
120 నిమిషాలు.
      పరీక్ష మాధ్యమం: తెలుగు, ఇంగ్లిష్‌.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 23.04.2024.
»    ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.05.2024.
»    హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 04.06.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 13.06.2024.
»    వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/ADCET

#Tags