TS TET Results 2024 Release Date : టీఎస్ టెట్ -2024 ఫ‌లితాలు విడుదల.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2024) ప‌రీక్ష‌లు జూన్ 2వ తేదీతో ముగియ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి (సీబీటీ)లో నిర్వ‌హిస్తున్నారు.

తెల‌గాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్- 1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. అయితే టెట్‌-2024 ఫ‌లితాలను జూన్ 12వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

తెలంగాణ‌లో టీచర్ పోస్తుల‌ భర్తీలో టెట్‌ స్కోర్‌కు వెయిటేజీ కూడా కల్పిస్తారు. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు 80 శాతం కాగా.. టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

#Tags