TG Inter Admissions 2024 : విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ అడ్మిషన్లకు చివరి తేదీ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ ఏడాది 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌ అడ్మీషన్లు ఈనెల 31తో ముగుస్తాయని తెలిపింది.జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకునేవారు ఆగస్టు 31లోగా చేరాలని, ఆ తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండవని బోర్డు స్పష్టం చేసింది.

IIT Madras Developed EV Charger: ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్‌.. దీని స్పెషాలిటీ ఇదే

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెట్, అన్ ఎయిడెట్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, టీఎమ్ఆర్జేసీ, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్ కోర్సులు అందిస్తున్నారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 22న జాబ్‌మేళా

వీటిల్లో అడ్మిషన్లు పొందేందుకు 2024-25 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్‌ గడువు ఈనెల 31తో ముగుస్తుందని, విద్యార్థులు ఈలోగా అడ్మీషన్లు పొందాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 

#Tags