Sports School Results: జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గత నెల 28న నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ సెలక్షన్‌ ఫలితాలను జూలై 5న‌ జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్‌ ప్రకటించారు.

రాష్ట్రస్థాయి సెలక్షన్‌కు సంబంధించి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఇందులో 13 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు హైదరాబాద్‌లోని హకీంపేటలో జూలై 11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌ ఉంటాయన్నారు.

  • రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌కు జిల్లాస్థాయిలో ఎంపికై న బాల, బాలికలు 10 పాస్‌ పోర్ట్‌ ఫొటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌, 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, ఆధార్‌ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్‌తో ఎంపికల్లో పాల్గొనాలని డీవైఎస్‌ఓ సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రందించాలని చెప్పారు.

ఎంపికై న బాల, బాలికల వివరాలు..

ఎస్‌.నందకిషోర్‌ (మహబూబ్‌నగర్‌), ఎం.నేహాన్‌సాయి (మిడ్జిల్‌), ఎల్విన్‌ స్టిఫిఎన్‌ (మహబూబ్‌నగర్‌), విఘ్నేష్‌కుమార్‌ సాయి (టంకర, హన్వాడ), ఎ.రోహిత్‌ (పాతమొల్గర, భూత్పూర్‌), జి.సాత్విక్‌ (బాలానగర్‌), వి.శశికపూర్‌ (వెంకటాపూర్‌, మహబూబ్‌నగర్‌), సుశాంత్‌నాయక్‌, అఖిల్‌ నాయక్‌, చరణ్‌నాయక్‌ (చిన్నచింతకుంట), తేజస్‌ నాయక్‌ (జడ్చర్ల), కె.సునీల్‌, సిద్దు (మహబూబ్‌నగర్‌) ఎంపికయ్యారు. బాలికలలో జానివ్యశ్రీ, శ్రీవిద్య (మహబూబ్‌నగర్‌), ఎం.సాయికీర్తి (చిన్నచింతకుంట), పి.వేదశ్రీ (అడ్డాకుల), జె.సుహాని (బాలానగర్‌), కల్పన (జడ్చర్ల), నవ్యశ్రీ (బాలానగర్‌), కె.రాధ (జడ్చర్ల) ఉన్నారు.
చదవండి: Free Coaching : సెకండరీ గ్రేడ్‌ టీచర్ పరీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌..

#Tags