10th Class Exam Centers: పదో తరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 54 కేంద్రాల ఏర్పాటు

మరికొన్ని రోజుల్లో జరగనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం అయినట్లు జీల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను వెల్లడించారు. అంతే కాకుండా విద్యార్థులను పరీక్ష కోసం ప్రోత్సాహించారు..

వరంగల్‌: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 54 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 287 పాఠశాలల నుంచి 9,455 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉండగా, ఇందులో 4,831 బాలురు, 4,624 బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు.

CBSE 10th Class Exams Results Date: ముగిసిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే..

అదేవిధంగా 82 మంది ప్రైవేట్‌గా రాయనున్నారు. హాల్‌టికెట్లు, ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో 7 పరీక్షలు ఉంటాయి. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఎవరికైనా హాల్‌టికెట్లు రాకుంటే www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డీఈఓ సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ నియమించినట్లు తెలిపారు.

AISSEE Results 2024 Out: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్‌ లింక్‌ ఇదే

పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్‌

విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా నడవనున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు నియమించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు జాగ్రత్తగా పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ పక్కల 144 సెక్షన్‌ అమలు చేయాలని, జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష సమయంలో పూర్తిగా మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ తెలిపారు.

TS Tenth Exams: పదో తరగతి వార్షిక పరీక్షలపై సలహాలు, సూచనలు

సందేహాల నివృత్తికి కంట్రోల్‌ రూం

పరీక్షల సందర్భంగా ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పరీక్షల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరికొంతమంది అధికారులను అందుబాటులో ఉంచనున్నారు. సందేహాలను నివృత్తి చేసేందుకు 8919974862 నంబర్‌ను సంప్రదించాలి.

Half day School 2024 Telangana : రేపటి నుంచే ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ ఇవే.. ఈ నిబంధనలు తప్పనిస‌రిగా..

విద్యాశాఖ అధికారుల ఫోన్‌ నంబర్లు

అధికారి పేరు హోదా ఫోన్‌ నంబర్‌

డి.వాసంతి డీఈఓ 7995087622

డీపీసీ నర్సింహారావు ఏసీజీఈ 9984625186

ఎస్‌.విజయ్‌కుమార్‌ ఎంఈఓ, ఖిలావరంగల్‌ 9441454346

సీహెచ్‌.సత్యనారాయణ ఎంఈఓ, పర్వతగిరి,

గీసుకొండ, నల్లబెల్లి 9948259693

ఎస్‌.రంగయ్య ఎంఈఓ, రాయపర్తి, వర్ధన్నపేట 9440036154

వి.రత్నమాల ఎంఈఓ, నెక్కొండ, నర్సంపేట,

చెన్నారావుపేట, ఖానాపురం 9963982957

S Nikita Degree Topper: డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్‌ నికిత

ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదు..

జిల్లాలో ఈనెల 18 నుంచి పారంభంకానున్న టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదు. – డి.వాసంతి, డీఈఓ

#Tags