TS Tenth Exams: పదో తరగతి వార్షిక పరీక్షలపై సలహాలు, సూచనలు
Sakshi Education
టెన్త్ విద్యార్థుల హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన బీసీ అభివృద్ధి అధికారి విద్యార్థులతో పరీక్షల గురించి మాట్లాడారు. అనంతరం, అక్కడి వసతులను తనిఖీ చేసి అక్కడి సిబ్బందులకు ఆదేశాలిచ్చారు..
వనపర్తి: ప్రభుత్వ వసతిగృహాల్లోని పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని బీసీ అభివృద్ధి అధికారి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం నాగవరంలోని బీసీ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ పరిసరాలు, వంటగదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
Language Training: నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి జపనీస్ భాషపై శిక్షణ
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నందున స్నాక్స్ అందించాలన్నారు. పరీక్షలంటే భయపడొద్దని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు రాసే విధానంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయనవెంట వార్డెన్ పి.రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Published date : 14 Mar 2024 02:08PM