Skip to main content

CBSE 10th Class Exams Results Date: ముగిసిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే..

CBSE 10th Class Exams Results Date
CBSE 10th Class Exams Results Date

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాలను మే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌తో పాటు మొత్తం 26 దేశాల్లో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. 

ఫిబ్రవరి 15- మార్చి 13 వరకు పరీక్షలు జరిగాయి. ఇదిలా ఉంటే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, 12వ తరగతి ప్రాక్టికల్‌ గడువును సీబీఎస్‌ఈ పొడిగించింది.

ప్రాజెక్ట్‌ వర్క్‌/ప్రాక్టికల్స్‌/అసెస్‌మెంట్‌లు మరియు గ్రేడ్‌ షీట్స్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు మరికాస్త సమయం ఇవ్వాలని పలు పాఠశాలలు సీబీఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన బోర్డు మార్చి 31వరకు గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ర్ణీత సమయంలోగా పాఠశాలలు మార్కుల వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా తెలిపింది.
 

Published date : 14 Mar 2024 03:12PM

Photo Stories