CBSE 10th and 12th Results 2024 Updates: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
Sakshi Education
సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. మే 20వ తేదీ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నట్లు సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్‌లో మే 20వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.
రిజల్ట్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి.
దేశ వ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
Published date : 03 May 2024 04:29PM
Tags
- CBSE 10th Class Results 2024
- CBSE 10th Class Results 2024 Link
- CBSE 10th Class Results 2024 Release Date and Time
- CBSE 10th Class Results 2024 Live Updates
- How to check CBSE Class 10 Results 2024
- How to check CBSE Class 12th Results 2024
- cbse 10th and 12th class results 2024
- cbse 10th class and 12th class results date and time
- cbse 10th class result 2024 release news telugu
- Central Board of Secondary Education
- 10th class
- 12th Class
- Official website
- CBSE results
- sakshieducation latest news