Skip to main content

CBSE Results 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతుల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ తేదీలు ఇవే..

CBSE Results 2024

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. ప‌దోత‌ర‌గ‌తిలో 93.6% శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 12వ తరగతిలో  87.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫలితాలపై సందేహాలుంటే రీవెరిఫికేషన్‌, రీవాల్యూయేషన్, సమాధానపత్రాల స్కాన్ కాపీలను పొందేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ వివరాలు ఇవే..


పదో తరగతికి సంబంధించి..

  • రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 20-24 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఇక సమాధాన పత్రాలు ఫోటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్‌4-5 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఒక్కో ఆన్సర్ బుక్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. 
  • సమాధాన పత్రాలు రీవాల్యూయేషన్ కావాలనుకునే విద్యార్థులు జూన్‌9-10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో రీవాల్యూయేషన్ కోరే ప్రశ్నకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. 


12వ తరగతికి సంబంధించి..

  • రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 17-21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇక సమాధాన పత్రాలు ఫోటోకాపీలు కావాల్సిన విద్యార్థులు జూన్‌1-2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఒక్కో ఒక్కో ఆన్సర్ బుక్‌కు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.
  • సమాధాన పత్రాలు రీవాల్యూయేషన్ కావాలనుకునే విద్యార్థులు జూన్‌6-7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో రీవాల్యూయేషన్ కోరే ప్రశ్నకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. 
Published date : 15 May 2024 05:08PM

Photo Stories