AISSEE Results 2024 Out: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(AISSEE) ఫలితాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జనవరి 28న నిర్వహించిన AISSEE 2024 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024)ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
AISSEE 2024 ఫలితాలను.. ఇలా చెక్ చేసుకోండి:
1. ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ exams.nta.ac.in/AISSEEను సంప్రదించండి.
2. హోం పేజీలో కనిపిస్తున్న AISSEE 2024 రిజల్ట్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ పుట్టినరోజు, అప్లికేషన్ నెంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
4. వెంటనే మీకు AISSEE 2024 ఫలితాలు కనిపిస్తాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డైరెక్ట్ లింక్ కోసం AISSEE 2024 result.ను క్లిక్ చేయండి.