Sainik School Entrance Exam: ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)2025 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 5వ ఉండనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ (NTA)వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పించనుంది.
Sainik School Entrance Exam
పరీక్ష తేదీ: ఏప్రిల్ 5, 2025 పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ (పెన్ & పేపర్ OMR షీట్ ద్వారా)
6వ తరగతి ప్రవేశ పరీక్ష
మొత్తం ప్రశ్నలు: 125 మార్కులు: 300
సబ్జెక్టుల వారీగా..
లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–50 మార్కులకు
మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు–150 మార్కులకు
ఇంటెలిజెన్స్25 ప్రశ్నలు–50 మార్కులకు
జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు– 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.