Skip to main content

School Holidays: రేపు పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం!.. కార‌ణం ఇదే..

తెలంగాణ‌: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఫిబ్రవరి 23న‌) సెలవు ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Medaram Fair Celebrations   schools are likely have holiday tomorrow    Statewide Holiday Request for Medaram Jatara

రాష్ట్రంలో మేడారం జాతర ప్రసిద్ధి గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడారం జాతర జరిగే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

చదవండి: School Holidays: మహాశివరాత్రి సందర్భంగా.. వరుసగా మూడు రోజులు సెలవులు..
కోటి మంది సందర్శించే రాష్ట్ర పండుగకు రాష్ట్రమంతా సెలవు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఆర్టీసీతో పాటు చాలా స్కూల్ బస్సులను మేడారం జాతరకు నడపడంతో పిల్లలు పాఠశాలకు, పెద్దలు ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే సెలవు ఇచ్చారు. మరి రాష్ట్రమంతా సెలవు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తున్నారు.

Published date : 22 Feb 2024 12:43PM

Photo Stories