Anganwadi Workers Retirement Benefits: ‘అంగన్‌వాడీ’ల రిటైర్మెంట్‌ లబ్ధిని ఇంత‌ చేయాలి!

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ లబ్ధి పరిమితిని పెంచాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి ప్రభుత్వాన్ని కోరారు.

అరకొర భృతితో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆమె జూన్ 7న‌ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి కరుణను తమ సంఘం ప్రతినిధులతో కలిశారు.

చదవండి: Anganwadi Schools: ప్రీస్కూల్స్‌గా అంగన్‌వాడీలు!

అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాల ని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాయం సరిపోదని వివరించారు.  కార్యదర్శిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి వేదవతి, రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు అరుణ తదితరులు ఉన్నారు.

చదవండి: Samagra Shiksha: బంగారు ‘భవిత’.. సమగ్రశిక్ష ద్వారా సంక్షేమ పథకాల వర్తింపు

#Tags