Singareni Jobs: సింగరేణి నియామకాల బాధ్యత ఈడీసీఐఎల్‌కు..
కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈడీసీఈఐఎల్ ద్వారా పరీక్షలు నిర్వహించనుండగా, మూడంచెల్లో అభ్యర్థుల తనిఖీ, నమోదు ఉంటుందని తెలిపారు. తద్వారా ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశముండదని పేర్కొన్నారు.
గతంలో ఈ సంస్థ కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. కాగా, సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్లు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నట్లు కొందరు తమ దృష్టికి తీసుకొచ్చినందున పరిశీలిస్తామని డైరెక్టర్ చెప్పారు.
చదవండి: Singareni Job Notification: పరీక్షలు తెలుగులో నిర్వహించాలి
లక్ష్య సాధన దిశగా..
సింగరేణి సంస్థ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు కంపెనీ నిర్దేశించిన 68.90 మిలియన్ టన్నుల లక్ష్యంలో 68.85 లక్షల టన్నుల ఉత్పత్తి (96 శాతం) నమోదు కాగా, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కార్మికుల సమష్టి కృషితో మిగతా లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకముందని చెప్పారు. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లో 100 శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఏరియాలపై దృష్టి సారించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉద్యోగులు, కార్మికులు కృషి చేయాలని డైరెక్టర్ కోరారు.