Common Test For All Government Jobs : ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేషన్‌లలో..!
దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌లో ఒకే కేటగిరి, హోదా, విద్యార్హతతో కూడిన నోటిఫికేషన్ల వివరాలు సమీకరిస్తోంది.
సంస్థలు వేర్వేరు పరీక్షలు, నియామకాలు చేపట్టడం వల్ల చాలా ఉద్యోగాలు బ్యాక్ లాగ్ స్థితిలో ఉండిపోతున్నాయి. అన్నిటికి విద్యార్హత ఒకటే అయినపుడు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి పరీక్షలు నిర్వహించి.., నియమకాలు చేపట్టడం మంచిదనే ఉద్దేశం నియామక సంస్థల్లో నెలకొంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేర్వేరు మెరిట్ జాబితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది.
రానున్న నోటిఫికేషన్‌లలో..
ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్తు సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్‌కో, ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఏఈ, ఏఈఈ, సబ్‌ఇంజినీర్ తదితర పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఈ ఏడాది అక్టోబరులో నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. ఈ రెండింటికీ వచ్చే జనవరిలో రాత పరీక్షలు ఉంటాయి. వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉమ్మడి రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని వేర్వేరుగా మెరిట్ జాబితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1,2,3,4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
తిరిగి బ్యాక్‌లాగ్ పోస్టులను..
రాష్ట్రంలో 9 వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి. మరోవైపు డీఎస్సీ పరీక్ష ముగిసింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది. గురుకులాల్లో నియమితులైన వారిలో చాలామంది ఈ పోస్టులకూ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్‌లాగ్ అయ్యే ప్రమాదముంది.
టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు..
డిగ్రీ కళాశాలలు, గురుకుల డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ ఇతర తత్సమాన స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు ఒకటే. అయితే రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు తలెత్తుతాయి.