Renuka Get Three Government Jobs: కష్టాలను జయించి.. మూడు ‍ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రేణుక!

తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా మంబోజిపల్లి గ్రామానికి చెందిన నల్ల రేణుక ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈమె, తల్లిదండ్రుల కష్టాలతో, భర్త ప్రోత్సాహంతో లక్ష్యాన్ని చేరుకుంది. తల్లిదండ్రులు నల్ల సత్తయ్య, ఆశ దంపతులది వ్యవసాయం కుటుంబం. రేణుకకు ఏడేళ్ల క్రితమే జగిత్యాలకు చెందిన హరీశ్‌తో వివాహమైనా కూడా తన లక్ష్యాన్ని మరువలేదు. అనుకున్న‌ది సాధించింది.

రేణుక చదువు ఇదే..

  • పదవ తరగతి వరకు మెదక్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాల
  • ఇంటర్‌: ఆదర్శ జూనియర్‌ కాలేజీ
  • డిగ్రీ: 2014లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ
  • ఎం.కామ్‌: కోఠి ఉమెన్స్ కాలేజీ

Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

ఆమె సాధించిన ఉద్యోగాలు ఇవే..

  • కామర్స్‌లో జూనియర్‌ లెక్చరర్‌ (ఎంచుకున్నది)
  • పీజీటీ సోషల్‌ టీచర్‌
  • టీజీటీ సోషల్‌ టీచర్‌

విజయానికి సంబంధించిన‌ ముఖ్యాంశాలు..

  • కష్టాలను అధిగమించి విజయం సాధించడం
  • లక్ష్యానికి అనుగుణంగా శ్రమించడం
  • భర్త ప్రోత్సాహం
  • గురుకుల కొలువుల పరీక్షల్లో రాణించడం

Government Jobs: ఒకేసారి ఐదు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన గ్రామీణ యువతి!

#Tags