Skip to main content

Success Story : ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా.. తెలుగుభాష ఎంచుకున్నా.. కోచింగ్‌ లేకుండానే.. ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

నా పేరు కబులాసాబ్‌. మాది తెలంగాణ‌లోని మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం, అమరవాయి. నేను ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో బీపెడ్‌, బీఎడ్‌ పూర్తి చేశారు.
Government Teacher Inspire Success Story    Telangana resident Kabulasab aiming for government employment

ఎలాంటి కోచింగ్‌ లేకుండా ఇంట్లో ఉండే చదివాను. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా.. నేను నా లక్ష్యాన్ని విడువలేదు. కష్టపడితే తప్పనిసరిగా విజయం వరిస్తుందనే నమ్మకంతో ముందుకెళ్లాను.

 Success Story : వ‌స్తే ఉద్యోగం.. లేక‌పోతే అనుభవం.. ఇదే ఆలోచ‌న‌తో చ‌దివా..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

ఈ కొలువు కోసం..
2012 డీఎస్సీలో క్వాలిఫై కాలేదు. 2017లో డీఎస్సీ, గురుకుల పరీక్షలు రాశాను. మళ్లీ కరోనా తర్వాత తెలుగుభాషను ఎంచుకున్నాను. 2021లో తెలుగులో సెట్‌, 2023లో నెట్‌లో క్వాలిఫై అయ్యాను. 2023 ఆగస్టులో టీజీటీ నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ కొలువుకు సంవత్సరం పాటు చదివాను. పెద్దల సలహాలతో ముందుకెళ్తూ.. 1:2 పద్ధతిలో టీజీటీ, జేఎల్‌ క్వాలిఫై అయ్యాను.

☛ Women Success Story : ఇంట్లో ఉండే ప్రిపేర్‌ అయ్యా.. నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

నా నమ్మకం ఇదే..
అయితే పీజీటీలో ఒక్క మార్కుతో డిస్‌క్వాలిఫై అయ్యాను. దీంతో కొంత నిరుత్సాహపడ్డాను. అయితే జేఎల్‌ డెమోలో ఉత్తమ ప్రతిభ కనబర్చి క్వాలిఫై అయ్యాను. తాజాగా విడుదలైన టీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. నా విజయానికి కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. అలాగే కష్టపడితే విజయం వరిస్తుందనే నమ్మకంతో చ‌దివి విజ‌యం సాధించాను.

☛ Inspiring Woman Success Story : శెభాష్ నిరోశా.. ఒక్కేసారి మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలతో ఔరా అనిపించావ్‌.. కానీ..

Published date : 22 Mar 2024 04:44PM

Photo Stories